యాదవ క్షత్రియ శంఖారావంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ
సత్యసాయి: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం యాదవ క్షత్రియ శంఖారావం నిర్వహించారు. మడకశిర మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సమాజంలో యాదవుల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగుపడాలంటే పిల్లలకు నాణ్యమైన చదువు అందించడం ఒక్కటే మార్గమని తెలిపారు. విద్యావంతులైనప్పుడే రాజకీయంగా, సామాజికంగా ఎదగగలరని పిలుపునిచ్చారు.