క్యారమ్స్ ఆడిన అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణ
GDWL: గద్వాల్ ఇండోర్ స్టేడియంలో శనివారం జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యారమ్స్, చెస్, జావిలిన్ త్రో, రన్నింగ్ పోటీలను ఆయన ప్రారంభించి అధికారులతో క్యారమ్స్ ఆడారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య, జిల్లా సంక్షేమ అధికారిని సునంద పాల్గొన్నారు.