తుర్కపల్లి కల్లుగీత కార్మిక సంఘం నూతన కమిటీ

యాదాద్రి: తుర్కపల్లి మండల కల్లుగీత కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. మండల అధ్యక్షునిగా మారగోని శ్రీరామ్మూర్తి, గౌరవ అధ్యక్షునిగా కొక్కొండ లింగయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎరుకల వెంకటేష్ గౌడ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా లింగంపల్లి విజయకుమార్, కూరెళ్ల రాజాలు, భాగ మల్ల వెంకటేష్, పాముల రాజు, కొండం నాగరాజు, కోశాధికారిగా మారగోని వెంకటేష్ ఎంపికయ్యారు.