'స్పెషల్ బోర్డు లేకున్నా అదనపు చార్జీ వసూలు'

NLG: బస్సులకు స్పెషల్ బోర్డు లేకున్నా అదనపు చార్జీ వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. రెగ్యులర్ ఛార్జి ఉంటుందనుకొని ఎక్కిన ప్రయాణికులకు బస్సు కొంత దూరం వెళ్లిన తర్వాత స్పెషల్ బస్సు అంటూ అదనపు చార్జీతో కండక్టర్లు టికెట్ కొడుతున్నారు. కండక్టర్‌తో వాదించలేక ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇది అన్యాయమని ప్రయాణికులు వాపోతున్నారు.