సీఎం ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పు

సీఎం ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పు

AP: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. రేపు ఢిల్లీకి వెళ్లాల్సిన సీఎం.. ఇవాళ రాత్రికే ఢిల్లీకి చేరుకోనున్నారు. పర్యటనలో ఆయన NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌ను కలవనున్నారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. అలాగే, 24న జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. అంతేకాకుండా, జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి కూడా హాజరయ్యే అవకాశం ఉంది.