VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలో కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం అదుపుతప్పి వృద్ధ దంపతులు కిందపడగా, వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో రాదమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురికి తరలించినట్లు తెలిపారు.