గోరంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్‌గా రంగన గోపాల్

సత్యసాయి: గోరంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్‌గా సోమందేపల్లికి చెందిన రంగన గోపాల్‌ను ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమందేపల్లి తొగట వీర క్షత్రియ సంఘం అధ్యక్షులు సీసీ హరిదాస్ రంగన గోపాల్ ఇంటికి వెళ్ళి అభినందనలు తెలిపారు. శాలువా, పూలమాలలు, బొకేలతో సన్మానించారు. రంగన గోపాల్ కష్టాన్ని గుర్తించి మంత్రి సవిత ఆయనని డైరెక్టర్‌గా నియమించారు.