రైతులకు రూ.31.04 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
PLD: బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన రైతు సంక్షేమ కార్యక్రమానికి వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్' పథకాల రెండవ విడత పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో 45,898 మంది అర్హులైన రైతు కుటుంబాలకు పీఎం కిసాన్ పథకం చెక్కును రైతులకు అందజేశారు.