నేడు అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

నేడు అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

ఏటా మే 4వ తేదీని అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడడంలో అగ్నిమాపక సిబ్బంది నిస్వార్థ సేవలను, త్యాగాలను గుర్తుచేసుకోవడానికి ఈరోజును ప్రత్యేకంగా కేటాయించారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను రక్షించే వారి గొప్పతనాన్ని కొనియాడేందుకు ఈరోజు ఓ అవకాశాన్ని అందిస్తుంది.