సమన్వయంతో నాయుడుపేట అభివృద్ధి

సమన్వయంతో నాయుడుపేట అభివృద్ధి

TPT: నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సూచించారు. బుధవారం అంబేద్కర్ భవన్‌లో జరిగిన మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.