పెన్షన్‌లు పంపిణీ చేసిన ఎంపీడీవో
ELR: గణపవరం మండల వ్యాప్తంగా శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్‌ల పంపిణీ పారదర్శకంగా జరుగుతుందని ఎంపీడీవో బేబి శ్రీలక్ష్మీ తెలిపారు. గణపవరం సచివాలయం -2లో పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో పరిశీలించారు. మండలంలో మొత్తం 8,569 లబ్ధిదారులు ఉన్నారన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో అనర్హత నోటీసులు అందుకున్నవారికి కూడా పెన్షన్‌లు అందజేస్తున్నామన్నారు.