VIDEO: గొర్రెల కాపరి దారుణ హత్య
NLG: కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో గొర్రెల కాపరి జానయ్య శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. వ్యవసాయ బావి వద్ద గొర్రెల మందకు కాపలాగా నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆయనను హతమార్చినట్లు తెలుస్తోంది. మృతదేహంపై తీవ్ర గాయాలున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.