పత్తి కొనుగోలుపై అధికారులకు సీఎం ఆదేశాలు
AP: పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రతిరోజు తనిఖీ చేయాలని సీఎం చంద్రబాబు మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడి సమస్యల్ని పరిష్కరించాలని సూచించారు. రంగుమారిన, తడిచిన పత్తిని కూడా కొనుగోలు చేసేలా చూడాలని స్పష్టం చేశారు. సమీపంలోని జిన్నింగ్ మిల్లులకే పత్తిని రవాణా చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం పేర్కొన్నారు.