గుంతకల్ మున్సిపల్ కమిషనర్ హెచ్చరికలు

గుంతకల్ మున్సిపల్ కమిషనర్ హెచ్చరికలు

ATP: గుంతకల్ మున్సిపల్ కార్యాలయంలో నాన్-పీహెచ్ వర్కర్ల హాజరును కమిషనర్ లక్ష్మీదేవి గురువారం తనిఖీ చేశారు. విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని సిబ్బందికి హెచ్చరించారు. అనంతరం ఫిట్టర్లతో సమీక్ష నిర్వహిస్తూ.. పట్టణంలో ఎక్కడా పైపులైన్ లీకేజీలు ఉండకూడదని, రోడ్లపైకి నీరు వృథాను అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.