స్వర్ణ గిరిని దర్శించుకున్న వంటలక్క

భువనగిరి: నగర శివారులోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని గురువారం బుల్లితెర నటి కార్తీక దీపం సీరియల్ ఫేమ్ వంటలక్క(దీప) దర్శించుకుని, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంటలక్క మాట్లాడుతూ.. స్వామి వారితో పాటు ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉన్నట్లు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనుభూతి కలిగింది అని పేర్కొన్నారు.