జిల్లాకు వర్ష సూచన
చిత్తూరు: జిల్లాలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు పడే వేళ ప్రజలు కరెంట్ స్తంబాల వద్ద ఉండొద్దని చెప్పారు. రైతులు పంట పొలాల్లో జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు, వృద్ధులను బయటకు పంపొద్దని అధికారులు హెచ్చరించారు.