సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

NZB: ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల లబ్ధిదారులు చదల్ వేణుగోపాల్, రేగుల పావనిలకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశానుసారం అందజేయడం జరిగింది. ఇందులో బీజేపీ జిల్లా ఓబీసీ అధ్యక్షులు యామాద్రి భాస్కర్, 61వ బూత్ అధ్యక్షులు వంగ వివేకానంద, 62వ బూత్ అధ్యక్షులు ఎలిగేటి విట్టల్, పుప్పాల గిరిధర్, వేముల లింగోజి పాల్గొన్నారు.