పేకాట శిబిరంపై దాడి.. 16 మంది అరెస్ట్

పేకాట శిబిరంపై దాడి.. 16 మంది అరెస్ట్

SKLM: ఎల్‌ఎన్ పేట(మం) పెద్ద కొల్లివలసలో పేకాట శిబిరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 16 మంది జూదరులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.17670 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై హైమావతి తెలిపారు. తమకు అందిన ఖచ్చితమైన సమాచారంతో దాడి చేసినట్లు ఎస్సై హైమావతి తెలిపారు. పేకాట ఆడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.