14 ఉచిత వైద్య శిబిరాలు

మన్యం: సాలూరు శ్యామలాంబ తల్లి పండగ నేపధ్యంలో పట్టణంలో 14 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శివకుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక పట్టణంలో డబ్బివీధి, మెంటాడ వీధిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలు పరిశీలించారు. అత్యవసర సేవలు కోసం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఫీడర్ అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.