మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కాకాణి

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కాకాణి

TPT: గూడూరు మడమనూరు వైసీపీ సీనియర్ నాయకుడు పసుపులేటి రవీంద్రబాబు చనిపోవడం బాధాకరమని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్లో ఆయన మృతదేహాన్ని కాకాణి పరిశీలించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. రవి పార్టీకి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.