ఇంటికి తిరిగి రాని వ్యక్తి.. చివరికి రోడ్డుపై!?

ఇంటికి తిరిగి రాని వ్యక్తి.. చివరికి రోడ్డుపై!?

KNR: కమాన్ పూర్ మండలంలోని పెద్దపల్లి–మంథని ప్రధాన రహదారిపై గుండారం సబ్బితం గ్రామాల సరిహద్దు ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పేరపల్లి గ్రామానికి చెందిన చెప్పాల దేవేందర్‌ రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం అతడు రోడ్డుపై శవమై కనిపించాడు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.