పది పరీక్షల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: DEO
కోనసీమ: ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో అధికారులు నిబద్ధతతో వ్యవహరించాలని DEO పి.నాగేశ్వరరావు ఆదేశించారు. ముమ్మిడివరం AIMS కళాశాలలో గురువారం నిర్వహించిన సమావేశంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన కనీస వసతులు కల్పించాలన్నారు.