'రోడ్డు పై వర్షం నీటిని తోలగించండి'
అన్నమయ్య: జిల్లాలో ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న వీధిలో రోడ్డుపై వర్షపు నీరు నిలువ ఉందని స్థానికులు తెలిపారు. వర్షాల కారణంగా నీరు ఇంకి పోకుండా రోడ్లపై ఉండడంతో ప్రజలకు ఇబ్బందిగా మారిందన్నారు. అయితే వాటి వల్ల విష జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే మండల అధికారులు చర్యలు చేపట్టి వర్షపు నీటిని తొలగించాలన్నారు.