ఈనెల 11న ఉద్యమకారుల మహా పాదయాత్ర

JN: తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికై ఈనెల 11న వరంగల్‌లో జరగబోయే మహా పాదయాత్రను జయప్రదం చేయాలని TUF జిల్లా అధ్యక్షులు తిప్పరపు ఆనందం పిలుపునిచ్చారు. గురువారం జనగామలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, వెంటనే తమ డిమాండ్‌లను పరిష్కరించాలన్నారు.