చాపరాయి జలపాతం రెండు రోజులు మూసివేత

ASR: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గురువారం, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలపాతాన్ని రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు కలెక్టర్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. జలపాతాన్ని సందర్శించేందుకు పర్యాటకులకు ప్రవేశం లేదని జలపాతం ఇంఛార్జ్ మేనేజర్ అప్పారావు తెలిపారు.