'హౌస్ లిస్టింగ్ క్రియేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి'
WNP: జనగణన ప్రక్రియలో భాగంగా హౌస్ లిస్టింగ్ బ్లాక్‌ల క్రియేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, HLB డిమార్కేషన్ పనులను రేపటి లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ నుండి తహసీల్దార్లుతో సమావేశం నిర్వహించారు.అధికారులు నిర్దేశిత గడువులోగా డీమార్కేషన్ పూర్తి చేయాలన్నారు.