ఆటోలను ఢీకొన్న కాలేజీ బస్సు
NTR: జి. కొండూరులో బ్యాంక్ సెంటర్‌లో ఇవాళ ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు రెండు ఆటోలను ఢీకొనడంతో స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.