దేవాదాయశాఖ అధికారి శాంతికి కస్టడీ
AP: దేవాదాయశాఖ అధికారి శాంతికి కోర్టు రెండు రోజుల కస్టడీ విధించింది. ఏప్రిల్ 15, 16న విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. ఇటీవల ఏసీబీ అధికారులు శాంతి నివాసంతో పాటు ఆమె బంధువుల ఇళ్లలో జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడినట్లు సమాచారం. అక్రమాస్తుల కేసులో ACB అరెస్ట్ చేయడంతో ఇప్పటికే ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.