అలర్ట్.. జిల్లాకు భారీ వర్ష సూచన.!
NZB: జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ ఈదురగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో జిల్లాకు ఎల్లో అలర్ట్ జారి చేసింది. ఈనేపథ్యంలో జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అధికారులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని సూచనలు చేసింది.