సింహాద్రి అప్పన్న అన్నప్రసాదానికి విరాళం
VSP: సుజాత నగర్‌కు చెందిన రంగా మహాలక్ష్మి కుమారి సింహాచలం సింహాద్రి అప్పన్న నిత్య అన్నప్రసాదానికి రూ.1,00,000 విరాళం అందించారు. బుధవారం ఆలయ పీఆర్‌వో కార్యాలయ డొనేషన్ కౌంటర్ వద్ద ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారి కె. తిరుమలేశ్వరరావుకు నగదుగా అందజేశారు. దాతకు దేవస్థాన అధికారులు స్వామివారి దర్శనం కల్పించి, ప్రసాదాలు అందించారు.