జాబ్ మేళాలో 262లో మందికి ఉద్యోగాలు

జాబ్ మేళాలో 262లో మందికి ఉద్యోగాలు

NLR: కావలి పట్టణంలోని MSR డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 262 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ జాబ్ మేళాలో 16 కంపెనీలు పాల్గొనగా 578 మంది హాజరయ్యారు. ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరిచిన 262 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసి, నియామక ఉత్తర్వులు అందజేశారు.