'శ్రీ రాములు త్యాగ ఫలితమే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం'

'శ్రీ రాములు త్యాగ ఫలితమే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం'

VSP: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు పాల్గొని శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడని అన్నారు. ఆయన త్యాగంతోనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నరు.