మత్స్యకారులందరిని ఆదుకోవాలని వినతి

మత్స్యకారులందరిని ఆదుకోవాలని వినతి

W.G: తీర ప్రాంత మత్స్యకారులందరికీ ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. ఈమేరకు నరసాపురం ఆర్డీవోను కలిసి ఆయన బుధవారం వినతిపత్రం అందించారు. ప్రభుత్వం తుఫాను సహాయ చర్యల్లో భాగంగా చేనేత, మత్స్యకారులలో కొన్ని కుటుంబాలకు మాత్రమే సహాయం చేయడం తగదని ఆయన అన్నారు.