'బస్ స్టేషన్ బోర్డు ఏర్పాటు చేయాలి'

'బస్ స్టేషన్ బోర్డు ఏర్పాటు చేయాలి'

VKB: బస్ స్టేషన్‌కు నేమ్ బోర్డు లేకపోవడంతో ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద బస్ స్టేషన్‌కు 'తాండూర్ బస్ స్టేషన్' అని బోర్డు లేదని మండిపడుతున్నారు. తాండూర్ నుంచి హైదరాబాద్, మహబూబ్నగర్, సంగారెడ్డితో పాటు కర్ణాటకలోని సేడం, చించోలి నగరాలకు బస్సు సౌకర్యం ఉంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.