VIDEO: ప్రజల్లో జల సంరక్షణపై అవగాహన కార్యక్రమం
WGL: ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఆదివారం వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. సత్య శారద పాల్గొని నీటిని వృథా చేయకుండా సంరక్షించాలని ప్రజలకు సూచించారు. ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా చైతన్యం కల్పించారు. మిషన్ భగీరథ ద్వారా నీటి శుద్ధి విధానాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.