పొట్టి శ్రీరాములుకు జడ్పీ సిబ్బంది నివాళి
VSP: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని విశాఖ జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి పి. నారాయణమూర్తి అన్నారు. సోమవారం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.