మూల మలుపుల వద్ద పెరిగిన చెట్లు
WGL: గీసుకొండ మండలంలోని మనుగొండ గ్రామం నుంచి ఎలుకుర్తి రోడ్‌కు వెళ్ళే మార్గంలో మూల మలుపుల వద్ద ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్లతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడడం లేదని ప్రయాణికులు వాపోయారు. దీంతో కాంగ్రెస్ జిల్లా నాయకులు అల్లం బాల కిషోర్ రెడ్డి స్పందించి తన సొంత ఖర్చుతో ప్రజల శ్రేయస్సు కోసం వాటిని డోజర్, జెసిబి సహాయంతో తొలగించారు. ఆయన సేవను గ్రామ ప్రజలు అభినందించారు.