జేఎన్టీయూ స్నాతకోత్సవానికి గవర్నర్, లోకేశ్?
ATP: అనంతపురం JNTU స్నాతకోత్సవం ఏప్రిల్ 6న నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వేడుకకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు జేఎన్టీయూ సిబ్బంది చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి.