VIDEO: వేమిరెడ్డి దంపతుల రూ.5 లక్షల విరాళం

NLR: పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు నెల్లూరులోని జనహిత వాత్సల్య సేవా సంస్థకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. శుక్రవారం ఎంపీ నివాసంలో సంస్థ కార్యదర్శి జీవీ సాంబశివరావుకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గత 37 ఏళ్లుగా ఈ సంస్థకు తమ సహాయ సహకారాలు అందిస్తున్నామని వారు తెలిపారు.