కలబందతో మొటిమలకు చెక్
ముఖంపై మొటిమలు, మచ్చలను తగ్గించడంలో కలబంద కీలక పాత్ర పోషిస్తుంది. 3 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ల పసుపు, రోజ్ వాటర్, కొంచెం శనగపిండి కలిపి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చని నీటితో క్లీన్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కలబండ గుజ్జులో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటే మంచిది.