ఆకట్టుకున్న బాల రాముడు వేషాధారణ

ఆకట్టుకున్న బాల రాముడు వేషాధారణ

SRD: నాగల్ గిద్ద మండలం కరస్ గుత్తి గ్రామంలో నేడు జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గ్రామానికి చెందిన అదిరాజ్ జైస్వాల్ బాల రాముడి వేషధారణలో అలరించాడు. వార్కారి సాంప్రదాయ భజనల కార్యక్రమంలో బాలుడు పాల్గొని భక్తిశ్రద్ధలతో భజనలు చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. అయోధ్య నుంచి బాల రాముడు దిగొచ్చినట్లు భావిస్తూ గ్రామస్తులు బాల రాముడిని దర్శించుకున్నారు.