'సముద్ర ఆహార ఎగుమతి పరిశ్రమను ఆదుకోండి'

భారత సముద్ర ఆహార ఎగుమతి పరిశ్రమను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీ ఫుడ్స్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరింది. అమెరికా విధించిన భారీ సుంకాలు, మార్కెట్ అవసరాలను అధిగమించేందుకు ఆర్థిక చేయూత అందించాలని ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఈ రంగంలో లక్షలాది ఉపాధులను కాపాడవచ్చు అని తెలిపారు.