ఇళ్ల నిర్మాణాలకు పొసెషన్ సర్టిఫికెట్లు జారీ చేయండి: కలెక్టర్

NDL: నంద్యాల జిల్లాలో 26,139 మంది ఇళ్లు లేని నిరుపేదలు ఉన్నారని.. ఇప్పటివరకు 12,651 ఇళ్లకు మాత్రమే పొసెషన్ సర్టిఫికెట్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మండలాల వారీగా సంబంధిత లబ్ధిదారుల డేటాను తీసుకొని అందరికీ పొసెషన్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తహసీల్దార్లను కలెక్టర్ సోమవారం ఆదేశించారు.