VIDEO: నామినేషన్ కేంద్రం పరిశీలించిన వీరారెడ్డి
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఎన్నికల వ్యయ పరిశీలకుడు వీరారెడ్డి నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియతో పాటు ఎన్నికల ప్రచారం, పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు అన్ని దశలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.