కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నమహిళకు వైద్యం
ELR: ఉంగటూరు మండలం గోపీనాథపట్నం గ్రామంలో కిడ్నీ బాధిత మహిళ గుడ్ల నాగలక్ష్మికి సీఎం చంద్రబాబు సోమవారం పింఛను అందించారు. నాగలక్ష్మి పిల్లలు నాగ పవన్, వాసవి చదువు గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నాగలక్ష్మికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్‌కు సూచించారు. కొద్దిసేపు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.