గోదావరిలో అదృశ్యమైన మృతదేహం లభ్యం

గోదావరిలో అదృశ్యమైన మృతదేహం లభ్యం

కోనసీమ: ఆత్రేయపురం మండలం పులిదిండిలో గత నెల 27న అదృశ్యమైన సత్యనారాయణ అనే వ్యక్తి శుక్రవారం గోదావరిలో శవమై తేలారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన సత్యనారాయణ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహం లభ్యం కావడంతో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు.