రామాయంపేటలో ఎఫ్ఎల్ఎన్ మేళా

రామాయంపేటలో ఎఫ్ఎల్ఎన్ మేళా

MDK: రామాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం ఎఫ్ఎల్ఎన్ మేళా నిర్వహించారు. మండల పరిధిలోని సుమారు 33 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేసే పరికరాలను తయారు చేశారు. వాటిని మేళాలో ప్రదర్శించారు. విద్యార్థులకు సులువుగా విద్య అర్థం చేసే విధంగా EFLN మేల నిర్వహిస్తున్నట్టు ఎంఈవో తెలిపారు.