లక్ష్మీ బ్యారేజీలో మళ్లీ పెరుగుతున్న వరద ప్రవాహం..

లక్ష్మీ బ్యారేజీలో మళ్లీ పెరుగుతున్న వరద ప్రవాహం..

BHPL: మహదేవపూర్ మండలం కాలేశ్వరంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. శనివారం సాయంత్రం 3,73,550 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైనట్లు నీటిపారుదల శాఖ తెలిపింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు 3,10,080 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం సాయంత్రానికి 63 వేల క్యూసెక్కులు పెరిగిందని అధికారులు తెలిపారు.