నేడు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు BRS వినతి పత్రాలు

HYD: లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ నిరసనలు చేపట్టాలని BRS శ్రేణులకు KTR పిలుపునిచ్చారు. ఉ.11 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని ఆరోపించారు.