లాల్ బజార్ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

లాల్ బజార్ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

HYD: లాల్ బజార్ మహంకాళీ అమ్మవారి బోనాల సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించే చీరను చేనేత కార్మికులచే ఆలయ ప్రాంగణంలో తయారు చేయించే కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. ఎంతో నిష్ఠతో అమ్మవారికి చీరను తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. అలాగే బోనాల ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.